అంబర్ పేటలో కిషన్‌రెడ్డికి భారీ షాక్ ` బీఆర్‌ఎస్ లో చేరిన బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ శ్రీమతి పద్మా వెంకట్ రెడ్డి గారు
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:అంబర్ పేటలో కిషన్‌రెడ్డికి భారీ షాక్ ` బీఆర్‌ఎస్ లో చేరిన బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ శ్రీమతి పద్మా వెంకట్ రెడ్డి గారు
మంత్రివర్యులు కేటీఆర్ గారి సమక్షంలో, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న కార్పొరేటర్ దంపతులు
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ లో చేరికలతో బెంబేలెత్తుతున్న ప్రతిపక్షాలు
హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర బిజెపికి భారీ షాక్ తగిలింది. ప్రస్తుత బిజెపి బాగ్ అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పద్మా గారు, వారి భర్త, బిజెపి జోగులాంబ గద్వాల జిల్లా ఇంఛార్జ్, బిజెపి గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షులు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీ బి వెంకట్ రెడ్డి గారు, ఈరోజు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి వర్యులు కేటీఆర్ గారి సమక్షంలో, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
కేటీఆర్ గారు వారికి పార్టీ కండువా కప్పి బీఆర్‌ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో వీరి చేరిక, బీఆర్‌ఎస్ ప్రభుత్వ పరిపాలనకు మరింత శక్తిని తీసుకువస్తుందని ఆయన చెప్పారు.
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు జరుగుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి విధానాల పట్ల ఆకర్షితులమయ్యామని, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారిలోని ప్రజాసేవ పట్టుదల మరియు అంబర్ పేట అభివృద్ధికి వారు చేస్తున్న కృషి నచ్చి బీఆర్‌ఎస్ లోకి చేరుతున్నట్లు కార్పొరేటర్ పద్మా గారు మరియు వెంకట్ రెడ్డి గారు ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర బిజేపీలో అధ్యక్ష పదవి చేపట్టిన బండి సంజయ్ రాష్ట్ర బిజేపీ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళినాడు.ఇతర పార్టీ నాయకులు ఆకర్షితులై బిజేపీలో చేరినారు.జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనివిని ఎరుగని రీతిలో కార్పోరేటర్‌లు విజయం సాధించినారు.బండి సంబయ్‌ని అధ్యక్షపదవినుంచి తొలగించినప్పటి నుంచి బీజేపీ కార్యాలయంలో సందడి కన్సించడం లేదు.బిజేపీకి ఆకర్షితులై చేరాలని కోరుకునే వారికి అడ్డు తగులుతూ వారిని చేరకుండా అడ్డుతగులుతున్నారు.ఈ మధ్యలో మాజీ మంత్రి శ్రీ క్రిష్టయాదవ్,చీకోటీ ప్రవీణ్ మొదలగు వారిని చేరకుండా చేయగల్గారు.సీనీయర్ నాయకుడైన మాజీ కార్పోరేటర్ బీజేపీ నగర మాజీ అధ్యక్షులు జోగులాంబ జిల్లా ఇంఛార్జ్ పార్టీ కొరకు పలు సేవలందించిన వెంకట్‌రెడ్డి అడుగడుగు న అడ్డు తగులుతూ అంబర్‌పేట్ అసెంబ్లీ సీటుకు మొదటి స్థానంలో ఉన్న వెంకట్‌రెడ్డి ఇక నాకు అంబర్‌పేట్ సీటు దక్కనీయరని ఒక నిర్ణయానికి వచ్చి ఇక ఈ అవమానాలు భరించలేనని వెంకట్ రెడ్డి దంపతులు టీఆర్‌ఎస్‌లో చేరిక జరిగింది.