సమాచార శాఖ సమీక్షలో మంత్రి డాక్టర్‌ పట్నం మహేందర్‌ రెడ్డి.

మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసిన రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్‌ అశోక్‌ రెడ్డి
ఎక్కువ చేసి తక్కువ చెబుతున్నాం..
సాధించిన ప్రగతిని ప్రజలకు చూపిద్దాం..
అభివృద్ధి ఫలాలను బాధ్యతగా నిరుపేదలకు చేరవేద్దాం
సమాచార శాఖలో ఖాళీగా ఉన్న 361 పోస్టుల భర్తీకి సీఎంకు నివేదిస్తాం…త్వరలోనే భర్తీ.
సిబ్బందికి కొత్త కెమెరాలు, వాహనాలు.. కొరత తీరుస్తాం
సోషల్‌ మీడియాలో సమాచార శాఖ పాత్రను పెంచుదాం.
మహిళా ఉద్యోగుల సమస్యలు తీరుస్తాం
జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట
ప్రెస్‌ అకాడమీ నూతన భవనానికి మరిన్ని నిధులు, త్వరలో ప్రారంభోత్సవం.
సమాచార శాఖ సమీక్షలో మంత్రి డాక్టర్‌ పట్నం మహేందర్‌ రెడ్డి.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో సాధించిన ప్రగతిని ప్రజలకు బాధ్యతగా తెలియజేయాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్‌ పట్నం మహేందర్‌ రెడ్డి అన్నారు.
సచివాలయంలో మొదటి అంతస్తులో సమాచార, పౌర సంబంధాల శాఖ పై
మంత్రి డాక్టర్‌ పట్నం మహేందర్‌ రెడ్డి గారు
ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్‌ అశోక్‌ రెడ్డి, డైరెక్టర్‌ రాజమౌళి, అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్న సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎక్కువ చేసి తక్కువ చూపిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రం అన్ని రంగాలలో సాధిస్తున్న ప్రగతి తో పాటు
మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ,కుటుంబ, రైతు సంక్షేమ పథకాలు లాంటి వాటికి, బతుకమ్మ సంబరాలు వినాయక చవితి, శ్రీరామ నవమి, జాతరలు, మహనీయుల చారిత్రక వారసత్వ అంశాలతో పాటు
ఉత్సవాలు, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగ సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలను సామాజిక చైతన్యం కోసం
మరింత విస్తృతమైన ప్రచారం చేయాల్సిన అవసరముందని ఆయన సూచించారు.
ఇందుకు సమాచార శాఖను బలోపేతం చేద్దాం.
సమాచార శాఖ లో ఖాళీలుగా ఉన్న వివిధ స్థాయిలోని
361 పోస్టును త్వరలో భర్తీ కోసం సీఎం కేసీఆర్‌ కు నివేదించాము…
సమాచార శాఖ బలోపేతానికి అవసరమైన అధునాతన కెమెరాలు, వీడియో కెమెరాలతో పాటు సిబ్బందికి వాహనాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలోకి సమర్ధవంతంగా తీసుకొని వెళ్ళాలి.
సమాచార శాఖ అధికారులు కష్టపడి శాఖ కు మంచి పేరు తేవాలి
అభివృద్ధి కార్యక్రమాల పై ఫోకస్‌ పెట్టాలి.
అధికారులు విజయ గాధ లపై ప్రత్యేక ద్రుష్టి సారించి..
విస్తృత ప్రచారం కల్పించాలి.


సమాచార శాఖలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
సోషల్‌ మీడియా సమాజంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సమాచార, పౌర సంబంధాల శాఖ సోషల్‌ మీడియాలో తన పాత్రను మరింత పెంచుకోవాలని చెప్పారు.
దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడంలో సమాచార పౌర సంబంధాల శాఖ అన్ని జిల్లాల సిబ్బంది కమిషనర్‌ అశోక్‌ రెడ్డి నేతృత్వంలో బాగా కష్టపడ్డారని ప్రశంసించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అదే స్ఫూర్తితో మరింత కష్టపడాలని అన్నారు.
ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్‌ నివేదిస్తామని చెప్పారు.
జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి అన్నారు.
జర్నలిస్ట్‌ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది.
జర్నలిస్టులు అంటే అందరికి గౌరవంఉంటుంది.
సీఎం కేసీఆర్‌
రూ. 100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమం కోసం అందించడం జరిగింది.
కరోనా బాధితులు, ప్రమాద బాధితులు తదితర
479 జర్నలిస్టు కుటుంబాలకు 6 కోట్ల 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాం.
136 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయంగా ఒక్కొక్కరికి 50 వేల చొప్పున 68 లక్షలు అందించడం జరిగింది.
దేశంలో
అత్యధికంగా 22,686 జర్నలిస్ట్‌ లకు అక్రిడిటేషన్స్‌ కార్డ్స్‌ ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే.
జర్నలిస్టుల పిల్లల చదువుల కోసం నెలకు 1000 చొప్పున రూ. 74 లక్షల 37 వేలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేసింది.
ఇలా జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రభుత్వం 19 కోట్ల నిధులను అందించింది.
అక్రిడిటేషన్‌ ఉన్న జర్నలిస్టులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఉచిత బస్సు పాస్‌ అందించాం.
హెల్త్‌ కార్డ్స్‌ ద్వారా జర్నలిస్ట్‌ ల ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం.
జర్నలిస్టులకు
మెడికల్‌ రీ అంబర్స్‌ మెంట్‌
ద్వారా ఆర్థిక సహయం అందించామన్నారు.
రాష్ట్రంలో 7460 మంది జర్నలిస్టులు రెండు రోజుల శిక్షణ తరగతులను నిర్మించి, వారిలో వృత్తి నైపుణ్యం పెంచేయత్నం చేశాం.
జర్నలిస్ట్‌ ల కోసం రూ. 15 కోట్లతో నిర్మించిన మీడియా అకాడమీ భవనం పూర్తి ఐయ్యింది.
భవనంలో ఆధునిక సదుపాయాల కోసం మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మరో రెండు మూడు కోట్లు అడిగారు వాటిని అందించేందుకు కృషి చేస్తున్నం.
సీఎం కెసిఆర్‌ తో చర్చించి భవనాన్ని
త్వరలోనే ప్రారంభించేందుకు నివేదిస్తాం.
అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలలో జర్నలిస్టులకు ప్రెస్‌ క్లబ్‌ లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మహేందర్‌ రెడ్డి వెల్లడిరచారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking