పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను.సి ఈ ఐ ఆర్. అప్లికేషన్ ద్వారా ట్రేస్ చేసి బాధితునికి అప్పగింత.జిల్లా ఎస్పీ చల్లా ప్రవీణ్ కుమార్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లా, సెప్టెంబర్, 22.ఎవరైన తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్న,చోరీ బాధితులు తక్షణమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్
వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే పోయిన సెల్ఫోన్ తిరిగి పోందే అవకాశం వుందని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయములో సి.ఈ.ఐ.ఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్న (12) సెల్ఫోన్లను వాటి యజమానులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేసారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.సెల్ఫోన్ పోగొట్టుకున్న, దొంగిలించబడిన ప్రజలు అధైర్య పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. సి ఈ ఐ ఆర్. వెబ్ పోర్టల్ అప్లికేషన్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమములో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీకోర్ ఇంచార్జ్ రవి కుమార్ తో పాటు ఐటీకోర్ విభాగం సిబ్బంది, సెల్ఫోన్ ల యజమానులు, పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.