ఘనంగా బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా. సెప్టెంబర్.22.పట్టణంలోని ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం లో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఆసుపత్రులలో రోగులకు పడ్లు పంపిణీ చేశారు. మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలొ.బి జె వై ఎం. ఆధ్వర్యం లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు రక్త దానం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking