సుందరయ్య నగర్ పార్కు దగ్గర కమ్యూనిటీ హాల్ ని గ్రంథాలయాన్ని నిర్మించాలి స్థానిక సమస్యలను పరిష్కరించాలి

। సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు.

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 28 (ప్రజాబలం) ఖమ్మం
గోళ్లపాడు కెనాల్ పై నిర్మించిన పార్కులో కమ్యూనిటీ హాల్ మరియు గ్రంథాలయాన్ని నిర్మించాలని అలాగే స్థానిక సమస్యలను పరిష్కారం చేయాలని సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు 30 డివిజన్లో బెజవాడ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుందరయ్య నగర్ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు గ్రంథాలయo లేక జ్ఞానాన్ని పెంపొందించుకోలేకపోతున్నారు కాబట్టి సుందరయ్య నగర్ లో గ్రంథాలయాన్ని నిర్మించాలని అలాగే ఇక్కడ అంతా పేద వర్గాలు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాలని ఆయన కోరారు అలాగే త్రీ టౌన్ లో అన్ని డివిజన్లో కుక్కల బెడద, దోమల బెడద, పందుల బెడద ఎక్కువగా ఉందన్నారు వీటన్నిటిని నివారించాలని అలాగే దోమల ఫాగింగ్ మిషన్ ఇదివరకు అన్ని డివిజన్లో తిరిగేది ఇప్పుడు ఏ డివిజన్ కి దోమల మందు ఫాగింగ్ మిషన్ రావడం లేదు. వెంటనే దోమల మిషన్ ని పంపించాలని దోమల మందును కొట్టాలని, గొళ్ళపాడు పార్కు చుట్టుపక్కల సిసి రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని వెంటనే సిసి రోడ్లను ఏర్పాటు చేయాలని అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాల్లో జరగాలి గాని ఒక్క మంత్రిగారు ఉన్న చోటే జరగకూడదని ఆయన అన్నారు సుందరయ్య నగర్ లో కమ్యూనిటీ హాల్ కి గ్రంథాలయానికి నిధులు కేటాయించాలని నిర్మాణ పనులు ప్రారంభించాలని సుందరయ్య పార్కులో వాకింగ్ చేసే దారిలో మట్టి అంత వర్షానికి కొట్టుకొని పోయిందని మరలా మట్టి పోయించాలని అలాగే పార్కులో శ్వాసకోశ వ్యాధులు సంబంధించిన చెట్లు ఉన్నాయని అవి పీల్చడం వలన వాకింగ్ వచ్చేవాళ్లు ఇబ్బంది పడుతున్నారని ఆ చెట్లను వెంటనే నరికివేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాస్ రావు, సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ హిమాం, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ నాయకులు రంగు హనుమంతచారి, మద్ది శ్రీను, వనమాల కృష్ణ, ఉడుగుల పద్మ, ఎర్ర లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking