ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రాథమిక విద్యా ప్రమాణాల పెంపొందించుటకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 28 (ప్రజాబలం) ఖమ్మం మంగళవారం అదనపు కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలం చిన్నవెంకటగిరి మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు అమలుపై క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల ప్రాథమిక విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, వారికి చదవడం, రాయడం సులభతరం చేసేలా తొలిమెట్టు కార్యక్రమం చేపట్టి, అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మాసం విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, ఫలితాల ఆధారంగా బోధన చేపట్టాలన్నారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె అన్నారు. విద్యా సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

అనంతరం సైన్స్ డే ను పురస్కరించుకుని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెర్ ను అదనపు కలెక్టర్ ప్రారంభించి, తిలకించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలని, ఇట్టి కార్యక్రమాల్లో పాలుపంచుకొనేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఎంపీడీఓ అశోక్, ఎంపిఓ శ్రీనివాసరావు, పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking