ప్రజా పాలనలో సాకారం కానున్న రైతుల దశాబ్దపు కల

ధర్మారెడ్డి ,పిల్లాయిపల్లి కాల్వలకు 210.2 కోట్ల రూపాయలు మంజూరు పట్ల హర్షం…
గతంలో 320 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే వేముల వీరేశందే
ఎమ్మెల్యేను కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన రామన్నపేట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు
నిధుల మంజూరుతో ఉమ్మడి జిల్లాలో బీడు భూములు సాగులోకి
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు నాయకులు
రామన్నపేట ప్రజాబలం ప్రతినిథి:డిసెంబర్‌ 19: ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువలకు నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం 2,10.2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించడం తో రైతుల దశాబ్దపు కాల చిరకాల కోరిక ప్రజాపాలన ప్రభుత్వంలో పూర్తికానుందని పిసిసి మాజీ కార్యదర్శి గోదాసు పృధ్విరాజ్‌ అన్నారు. రామన్నపేట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం హైదరాబాద్‌ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి ఆయనను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. రైతులను రాజుగా చూడాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని వారు అన్నారు. రైతుల బాధలను గుర్తించి గతంలో 350 కోట్ల రూపాయలు, నేడు 210 .2కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత రైతు బాంధవుడు నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం దే అన్నారు. ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువలకు నిధులు మంజూరు చేయించడంతో ఉమ్మడి జిల్లాలోని బీడు భూములు సాగులోకి రానున్నాయని తెలిపారు. కాలువల ఆధునీకరణ పనులు సంవత్సర కాలంలో పూర్తి అవుతాయని వారు
తెలిపారు. సాగునీటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఇందుకోసం మూసీ ఆధారిత కాలువలకు నిధులు మంజూరు చేయడమే నిదర్శనం అన్నారు. ఈ నిధులతో కాలువల బెడ్‌ వెడల్పు పెంచడం, గైడ్వాల్స్‌ నిర్మాణం, భూసేకరణ చేపట్ట నున్నట్లు వారు తెలిపారు. 50 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్న కాల్వ ఆకృతిని 208 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా కాల్వ ఆకృతిని పెంచనున్నారని తెలిపారు. దీంతో పాటు కల్వర్టుల నిర్మాణం , భూసేకరణకు రైతులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. దీంతో కొన్ని వందల గ్రామాలు వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking