జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థిని..
డీఈవో చేతుల మీదుగా ప్రశంస పత్రం , షీల్డ్ అందుకున్న విద్యార్థిని సిరి
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో రామన్నపేట మండలం ఎన్నారం గ్రామ పదవ తరగతి విద్యార్ధినీ బండమీది సిరి తండ్రి శ్రీను అను విద్యార్థిని నేడు జరిగిన జిల్లా స్థాయి బయో సైన్స్ టాలెంట్ పరీక్షలో 12 మండలాల విద్యార్థులతో పోటీ పడి ద్వితీయ స్థానం పొంది , రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన బండమీది సిరి అనే విద్యార్థిని లియాదాద్రి జిల్లా %ణజుూ% గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం మరియు షీల్డ్ అందుకోవడం జరిగిందనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్నమాల గారు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినికి పలువురు అభినందనలు తెలిపారు.. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి విద్యార్థులల్లో దాగివున్న సృజనాత్మక శక్తిని బయటికి తీసే ప్రయత్నం నిరంతరం చేస్తున్నామని
గైడ్ టీచర్ నీలం శేఖర్ తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఎమ్‌ఎన్‌ఓ శ్రీనివాస్ డీఈవో సత్యనారాయణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ జంగమ్మ , ఉపాధ్యాయులు జహీంగిర్ ,జగదీశ్వర చారి , విష్ణు , విజయ ప్రతాప్ , తదితరులు పాల్గొన్నారు..