మల్కాపూర్ గ్రామంలో రైతులకు ఉపయోగపడే డ్రోన్ యంత్రం.

మెదక్ తూప్రాన్ మార్చ్ 22 ప్రాజబలం న్యూస్:-

మహిళల ఆర్థిక స్వాలంబన కోసం కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సుమారు 9 లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్ పరికరాన్ని ఉచితంగా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామానికి చెందిన మహిళ రైతు పిట్ల వరలక్ష్మికి గ్రోమోర్ కోరమండల్ సౌజన్యంతో కంపెనీ ప్రతినిధులు అందజేశారు. రైతుల పంట పొలాలకు, కూరగాయల పంటల సాగుకు క్రిమిసంహారక మందు పిచికారికి ఈ డ్రోన్ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మహిళా రైతు వరలక్ష్మిని గ్రామ తాజా మాజీ, సర్పంచ్, ఉపసర్పంచ్, రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ స్వామిలు ఘనంగా సత్కరించారు. సుమారు 20 రోజుల పాటు డ్రోన్ యంత్రంపై అధికారులు శిక్షణ ఇచ్చినట్లు మహిళా రైతు వరలక్ష్మి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని మహిళా రైతు తన నైపుణ్యంతో సాధించడానికి ప్రోత్సాహం అందజేసిన వరలక్ష్మి భర్త చెన్నయ్యను ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking