ఈరోజు 23న జిల్లాకు ఇన్చార్జి మంత్రి సీతక్క రాక

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఈ నెల 23 ,24 శని,ఆదివారం ,నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారని ,డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు గురువారం తెలిపారు. 23 న శనివారం ఉదయం ఖానాపూర్ పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్ లో ఉదయం 11 :00 గంటలకు, నిర్మల్ లోని శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం 2:00 రెండు గంటలకు ,24 న ఆదివారం ఉదయం భైంసా లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ పదాధికారులు హాజరు కావాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking