కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు కౌన్సిలర్ లు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు నల్లూరి పోశెట్టి, తారక వాణి రఘువీర్ లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత పది సంవత్సరాల కాలం లో కుటుంబ పాలనలో విసిగిపోయిన బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న పాలనకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking