ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల
కేరళ హైస్కూల్ లో శుక్రవారం ఘనంగా సైన్స్ ఎక్స్ పో ని నిర్వహించడం జరిగింది ఈ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను కేరళ హైస్కూల్ డైరెక్టర్ బైరబోయిన సంపత్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం సంప్రదాయ బద్దంగా కాకుండా ఆధునిక ఆలోచనలను జోడించి విద్య ను అందించాలని తద్వారా వారిలో సృజనాత్మాకత పెంపొందుతుందని పేర్కొన్నారు విద్య అనేది ఉపన్యాస పద్ధతిలో కాకుండా చేయడం ద్వారా నేర్చుకోవడం అనే విధానంలో అందించడం జరగాలని, ఇలాంటి సైన్స్ ఎక్స్ పో లు పిల్లలలో నేను చేయగలను, నేను సాధించగలను అనే భావనలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్ లను సందర్శించి వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కేరళ హైస్కూల్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ మరియు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
