విద్యార్థులు లక్ష్యాలను నిర్ధేశించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ప్రిన్సిపాల్ అప్పని లక్ష్మణ్

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 28 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట వాగేశ్వరి కళాశాల ఆధ్వర్యంలో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన వేడుకను పురస్కరించుకుని స్థానిక ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో వీడ్కోలు సమావేశ వేడుకను ఘనంగా జరిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ మాట్లాడుతూ…విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని,ఇష్ట పడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వాగేశ్వర కాలశాలలో చదివిన పూర్వ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో,వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని,ఈ విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని అప్పుడే ఈ ప్రపంచంతో పోటీ పడగలమన్నారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు పుప్పిరెడ్డి శ్రీధర్ రెడ్డి,వెన్నంపెల్లి మహేందర్,గాదాసు సాగర్, గడిగొప్పుల శ్రీనివాస్,గుజ్జేటి నరేశ్,చంద వెంకటరమణ,చిలుకూరి వంశీ,ఉపాధ్యాయబృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking