ప్రజా బలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్, ఫిబ్రవరి 28
టైలర్స్ డే సందర్భంగా మందమర్రి మార్కెట్ లో మేరు కులస్తులు, టైలర్స్ కలిసి శుక్రవారం హనుమాన్ టెంపుల్ ఆవరణలో టైలర్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి విజయ్, ప్రధాన కార్యదర్శి మంద తిరుమలరెడ్డి, గంప ఆంజనేయులు పాల్గొని మేరు కుల దైవం శంకర దాసమయ్య చిత్రపటానికి పూలమాలవేసి కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ కమిటీ అధ్యక్షులు విజయ్ మాట్లాడుతూ మేరు కులస్తులు ఉపాధి కోసం పనిముట్ల కోసం సబ్సిడీ ప్రభుత్వం అందజేస్తుందన్నారు.మంద తిరుమలరెడ్డి మాట్లాడుతూ మనిషి జీవితంలో వేసుకునే దుస్తులను అందంగా చిత్రీకరించడంలో మేరు కులస్తులది ప్రధాన పాత్ర అని అన్నారు. మేర సంఘం పట్టణ అధ్యక్షులు రాయబారపు వెంకన్న, గౌరవ అధ్యక్షులు రాయబారపు జనార్ధన్ లు మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తులు కార్పొరేటు షాపింగ్ మాల్ లు రావడం వల్ల చేతి పనిముట్లతో చేసే మా మేరకులం అంతరించి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు మిషన్ తో కుట్టే దుస్తులను వాడే సమయంలో చేతినిండా పని ఉండేది కానీ ప్రస్తుత కాలం కుట్టు మిషన్ పని లేకపోవడంతో మేరుకులస్తులు కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో మేరు సంఘం ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి రవీందర, మందమర్రి పట్టణ ఉపాధ్యక్షులు రాయబారపు కిరణ్, గట్ల సారంగపాణి, కోశాధికారి సూర్యనారాయణ, కర్నె వెంకన్న, గంగాధర్, లక్ష్మణ్, రవి, సుజిత్, రాము, సూర్య ప్రకాష్, సత్యనారాయణ, శ్రీనివాస్, రజీనా, రాజు, కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.