ఆర్.పి.ఐ ( ఆథవాలే ) మైనారిటీ జిల్లా అధ్యక్షుడిగా రహమత్ ఖాన్

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 28 :

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆథవాలే) ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షుడిగా మందమర్రి పట్టణానికి చెందిన మహమ్మద్ రహమత్ ఖాన్ ను నియమిస్తూ శుక్రవారం నియామక పత్రాన్ని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగపిండి రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా రహమత్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తామని తనపై నమ్మకంతో మైనారిటీ సెల్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్ కు జిల్లా కార్యవర్గ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ పులిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గరిగె వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎండి యాకూబ్ నాయకులు ఎండి రహీం బాబా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking