గజ్వేల్ నియోజకవర్గం ఫిబ్రవరి 3 ప్రజాబలం ప్రతినిధి :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు పడాలపల్లిలో కౌన్సిలర్ శ్రీ బొంది అరుణ వెంకట్ గౌడ్ దంపతులకు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో చేసినటువంటి అభివృద్ధి పనులపై , మరియు కరోనా మహమ్మారి విజ్రూంభించిన సమయంలో కౌన్సిలర్ గారి సేవలు చరిస్మయం అని కొనియాడారు. సంఘం సభ్యులు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఐదేళ్లు సేవలందించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న కౌన్సిలర్ బొంది అరుణ వెంకటగౌడ్ దంపతులను అభినందిస్తూ అంబేద్కర్ సంఘంలోని అన్న తమ్ముళ్లు అక్క చెల్లెలు అందరూ కలిసి శాలువాల, పూలమాలతో,ఘనంగా సన్మానించారు.