అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో తుమ్మలకు ఘన సన్మానం

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కాంగ్రెస్ నాయకులు బమ్మిడి శ్రీనివాస్ అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి వీర్ల వరప్రసాద్, టిపిసిసి మెంబర్ పుచ్చకాయల వీరభద్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మంత్రి క్యాంపు కార్యాలయంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు, సభ్యుల సమక్షంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా బమ్మిడి శ్రీనివాస్ తన చేతుల మీదుగా తయారుచేసిన తుమ్మల చిత్రకళాఖండమును తుమ్మలకు బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కురుమ యాదవులు మాట ఇస్తే మాట మీద నిలబడతారని, గత ప్రభుత్వo ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా యాదవ కురుమలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ను ఇచ్చి గెలిపించారని, వారిని తప్పక కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుందని , వారి ఆశయాలు కోరికలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ , ప్రత్యేకంగా బీసీ వర్గాలను ప్రోత్సహించి, ఆదరించే మహా వ్యక్తి తుమ్మల అని ఉమ్మడిఖమ్మం జిల్లా అభివృద్ధి విషయంలో నలుమూలల తుమ్మల మార్క్ కనబడుతుందని, చిన్న పల్లెటూరులో కూడా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు గొర్రెల పంపిణీ పథకం కొరకు డీడీలు తీసి ఉన్న లబ్ధిదారులకు రెండు లక్షల రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి బదిలి చేయాలని, గొర్రెల మార్కెట్ యార్డు అభివృద్ధి చేయాలని, కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాలకు గొర్రెలకు బదులు పాడి గేదెలు ఇప్పించాలని, మల్లి బాబు యాదవ్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో , దుబాకుల శ్రీనివాస్, దుబాకుల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పల్లె బోయిన చంద్రం, మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, మూడుముంతల గంగరాజు, పొదిల పెద్ద పాపారావు, సత్తి వెంకన్న,పాపయ్య, పొదిల భిక్షం, పల్లెబోయిన పుల్లారావు, రవి,చింతల ఉపేందర్,నరసింహారావు, రేఖ మురళి, వడ్డేపూడి మల్లికార్జున్, మంద నాగేశ్వరరావు, బాతుల సుధాకర్ చంద్రకాని వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking