సిద్దిపేట్ డిసెంబర్ 26 ప్రజ బలం బ్యురో: తెలంగాణ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రిస్టియన్ సోదరులు… సంబురంగా క్రీస్తు జన్మదినాన్ని జరుపుకున్నారు. ఇందులో భాగంగా చేర్యాల పోలీస్ స్టేషన్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు దామోదర్, రామ్మెహన్‌లు పాల్గొని… కేక్ కట్ చేసి, పరస్పరం తినిపించుకున్నారు. అనంతరం సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ… క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయతకు అద్దం పట్టేలా అందరూ సోదరభావంతో మెలగాలని కోరారు. క్రీస్తు జన్మదిన వేడుకలను చేర్యాల పోలీస్ స్టేషన్‌లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో డా. బీ.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత కర్రోళ్ల నవజీవన్ మరియు డీడబ్ల్యూజేఎస్ మెంబర్ కర్రోళ్ల అన్నమ్మ, మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.