ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిగా నిలిచిన గ్రీకువీరుడు

మంత్రి కేటిఅర్ పై నిప్పులు చెరిగిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రభాకర్
హైదరాబాద్ జూన్ 27); ఉప్పల్ లోని స్కై వాక్ ప్రారంభొత్సవానికి విచ్చేసిన గ్రీకువీరుడు,లీకు వీరుడు అది ఒక అధికారిక కార్యక్రమం అని తెలిసి కూడా అక్కడ రాజకీయం మాట్లాడి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిగా నిలిచిపోయాడని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప్పల్ లో అడుగుపెడుతున్న మున్సిపల్ మంత్రికి ఉప్పల్ ప్రజలు స్వచ్చందగా మాట ఇచ్చి మాట తప్పిన మంత్రి అంటూ ఉప్పల్ ప్రజలు ముచ్చమటలు పట్టించి నీళ్ళు తాగించారన్నారు.. ఇక్కడి పరిస్థితి ఎదురీత,నల్ల బెలూన్ల ఎగురవేత, వ్యాపార వేత్తల బంద్ నిరసనలు అన్ని కట్టడి చేసిన తర్వాతనే మంత్రి అడుగుపెట్టడం జరిగిందన్నారు.గతంలో ప్రాతినిధ్యం వహించిన శాసన సభ్యునిగా కొన్ని ప్రశ్నలను మంత్రికి సందించడం జరిగింది.శాసనసభలో ఏమి మాట ఇచ్చావు,ఎన్నికల సమయంలో ఏమి వాగ్ధానం చేసావు వాటికి సమాధానం చెప్పి అడుగుపెట్టాలని ,ఏ ముఖం పెట్టుకొని వస్తావు అని నిలదీయటం జరిగిందని చెప్పారు.ప్రజలు స్వచ్చంధంగా బంద్ పాటించి నిరసన ర్యాలీలు నిర్వహించారు.ముందస్తు అరెస్టులు చేసారు, గృహనిర్భంధాలు చేశారు అయినా పోలీసుల కళ్లుకప్పి బీజేపీ నాయకులు ,కార్యకర్తలు,ప్రజలు స్వచ్చంధంగా రహదారిమీదకు వచ్చి నిరసన ర్యాలీ తీస్తే అరెస్టు జరిగిన తరువాత అంతా సద్దుమణిగింది అంతా బాగానే ఉంది అని తెలుసుకుని అప్పుడు మంత్రి ఉప్పల్ లో అడుగు పెట్టాడన్నారు..అది రాజకీయ సభన అధికార సభ నా అని ప్రబాకర్ ప్రశ్నించారు.సభలో ఆయన మాట్లాడుతూ అనేక రకాల ప్రేలాపలను చేసాడు.అది జాతీయ రహదారి మీరు చేస్తారా మేము చేస్తామా అని అడిగారంట అప్పటి శాసనసభ్యునిగా ముఖ్యమంత్రి కి లేఖ ఇచ్చి కేంద్ర మంత్రి అయినా నితిన్ గడ్కరి గారి ఆమోదం తీసుకుని నిధులు మంజూరు చేయించి స్వయంగా గడ్కరి గారిని రప్పించి రామంతాపూర్ లో శంకుస్థాపన చేయించి పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.పనులు ప్రారంభం అయినా తరువాత 6 నెలల లొపు భూ సేకరణ పూర్తి చేయాలి ,లైట్లు మార్చాలి,పైపు లైనులు మార్చాలి ,కరెంటు స్థంభాలు తీయాలి అనే ఒప్పందం జిహెచ్ఎంసి రాసిచ్చింది. చేస్తాం,చేసి చూపిస్తాం అని 6 నెలలు కాస్తా 6 ఏండ్లు దాటిన ఇంకా కరెంటు స్థంబాలు అక్కడే ,పైపు లైనులు అక్కడే ఉన్నాయి అవి అంతే ఉంటే పిల్లర్లు ఎలావేస్తారు,వీటన్నిటినీ తొలగించాల్సిన భాద్యత జిహెచ్ఎంసి దే నన్నారు. వీటన్నిటిని పక్కనపెట్టి కేంద్రం మీద నిందలు వేయటం ,తప్పు పడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
మిషన్ కాకతీయ
దశాబ్ధి ఉత్సవాల్లో మిషన్ కాకతీయని విజయవంతంగా చేసామని చెరువుల పండగలు చేశారు. శాసనసభ్యునిగా ఉన్నపుడు శాసనసభలో నిలదీస్తే అప్పటి పురపాలక మంత్రులుగా ఉన్న తండ్రి కొడుకులు అక్కడ మాటిచ్చారు, రాయకీయవేదికగా కూడా మాటిచ్చారు కాని నేటి ఉప్పల్ నల్ల చెరువు,రామాంతాపూర్, హెచ్ఎంటి నగర్,ఎర్రకుంట చెరువుల స్థితి ,పరిస్థితి,దుస్థితి జంట నగరాలలోని ప్రతి చెరువుల పరిస్థితి ఇదేవిధంగా ఎటువంటి సుందరీకరణకు,అభివృద్ధికి నోచుకొలేదన్నారు..మీ మిషన్ కాకతీయ ఏమైందీ, ఎవరిని మభ్యపెట్టటానికి,మోసంచేయటానికి ఈ దశాబ్ది ఉత్సవాలు అని ప్రశ్నించారు. అత్యంత అవినీతి మంత్రి ,అవినీతి శాఖ ఏదయినా ఉంది అంటే అది నీ పురపాలక శాఖానే అది నీ పనితీరుకి నిదర్శన మన్నారు.
ఇకపోతే దత్తత డ్రామాలు.
జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ప్రతి డివిజన్ కి ప్రతి గల్లీకి వెళ్లి ఎక్కడికి వెళ్తే అక్కడ దత్తత అనే డ్రామ కూతురు ఒక దగ్గర,కొడుకు ఒక దగ్గర,మేనల్లుడు ఒకదగ్గర అయ్య ఒక దగ్గర దత్తత డ్రామాలు ప్రదర్శించి వస్తారు.ఇప్పటికి సంవత్సరాలు గడుస్తున్న రామాంతపూర్ ని దత్తత తీసుకుంటున్న అన్నకేటిఆర్ ఇప్పటివరకు కనీసం ఇంటి నంబర్లకు కూడా నోచుకొని దుస్థితి.మా నియోజకవర్గంలో కూతురు కవిత వచ్చింది ఇంకో దగ్గర దత్తత అన్నారు అక్కడి పరిస్థితి దుస్థితి దారుణాతి దారుణంగా తయారయ్యింది.వీళ్ళు కేవలం ఉపన్యాసాలకి ,విన్యాసాలకి,ట్విట్టర్ మాటలకి మాత్రమే మంత్రులు. ఆచరణలో మాత్రం శూన్యం, చేస్తున్న పని మాత్రం ఏంలేదన్నారు.జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో నీటికి పన్ను ఏంటి అని కొడుకు అంటే ,పన్నే లేదు అని తండ్రి అంటాడు,అసలు పేదవాళ్ళకి పన్నే ఉండదు అని కూతురు అంటది,అంతా మాఫీ అని అల్లుడు అంటాడు 10,000 ఇస్తూ.కాని ఇప్పుడు నీటి పన్ను 800 నుండి 1500 వరకు వస్తుంది ఇచ్చిన మాట తప్పటం అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్లు ఈ కల్వకుంట్ల కుటుంబ సభ్యులని నిప్పులు చెరిగారు.

అదేవిదంగా పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతో అభివ్రుద్ధి చేస్తాదని అనుకుంటే అక్కడ కూడా నిరాశనే మిగిలింది.ఒక్కొక్క పరిశ్రమని మూసేస్తూ కొనుక్కుంటూ ఉన్న ఏకైక మంత్రి ఈ KTR .మోడరన్ బ్రేడ్,అశోక్ లేలాండ్ ,పెంగ్విన్ టెక్సటైల్స్ ఎవరు కొన్నారు అని నిలదీశారు.ఇప్పటికే ప్రజలు మీ మాయమాటలు నమ్మే స్థితిలో లేరు అని తెలిపారు.ఈ విదంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టారు.
ఈ సమావేశంలో హబ్సిగూడ కార్పొరేటర్ చేతన గారు,రామాంతాపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు, ఉప్పల్ సీనియర్ నాయకులు మహంకాళి లక్ష్మణ్,గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్,ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ బాలచందర్ ,శిల్ప రెడ్డి,అంబటి వెంకటాచలం,మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్, రాంప్రదీప్,సింగారం కార్తీక్,A.పద్మారెడ్డి, మహేశ్వర్ రెడ్డి,శ్రీకాంత్ ముదిరాజ్ మరియు ఇతర నాయకులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking