కరీంనగర్ బార్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు గురువారం కోర్టు ఆవరణలోని మీడియేషన్ సెంటర్లో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పీవీ రాజ్ కుమార్, బేతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నికి
ముఖ్య అతిథిగా హాజరై మంత్రి పొన్నం మాట్లాడుతూ న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు/కాలనీ, రెండు లక్షల ఇన్సూరెన్స్ నుండి ఐదు లక్షలు, జూనియర్ న్యాయవాదులకు స్టైపండ్ , అదేవిధంగా నగరంలో ఐదు ఎకరాల భూమి విషయాల గురించి బార్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రం పరిశీలిస్తానని తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ కార్యవర్గం మంత్రి పొన్నం కు పూల మొక్క, శాలువా, చిత్ర పటాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ లీగల్ సెల్ తరపున, పలువురు సీనియర్ న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, మహిళ న్యాయవాదులు, న్యాయవాద గుమాస్తాలు, శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరేపెల్లి మోహన్ తోపాటు పలువురు సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు అదిక సంఖ్య లో పాల్గొన్నారు.