రుణమాఫీతో రైతుల్లో ఆనందోత్సవాలు
బృహత్తర కార్యక్రమాలన్ని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు
నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహమ్మద్ జావేద్
ఖమ్మం ప్రతినిధి జులై 18 (ప్రజాబలం) ఖమ్మం రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని డిసిసి అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ స్పష్టం చేశారు. రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ సందర్భంగా బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తో కలిసి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ఇచ్చిన మాట నెరవేరుస్తుందని మరో మారు నిరూపించిందని తెలిపారు. 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం చలాయించిన బీఆర్ఎస్ కనీసం లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా ధనికంగా ఉన్న రాష్ట్రాన్ని 7లక్షల కొట్ల రూపాయల అప్పుల పాలు చేసిందని విమర్శించారు. అప్పుల్లో ఉన్నా కూడా ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు గారెంటీలను అమలు చేస్తూ రైతు రుణమాఫీ చేయడం ప్రజా ప్రభుత్వం లక్షణం కాదా అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నే దేశవ్యాప్తంగా 71 కోట్ల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర ఉందని అలాంటిది చిన్న రాష్ట్రం అయిన తెలంగాణ లో 31 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి ప్రభుత్వం పై అక్కరకు రాని విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. దేశానికి స్వాతంత్రం తేవడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడం, రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడం చూస్తుంటే బృహత్తర కార్యక్రమాలన్నీ ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని దీమా వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన, రాహుల్ గాంధీ కి, సోనియా గాంధీకి , మల్లిఖార్జున్ ఖర్గెకు డైనమిక్ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మాత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగేటి శ్రీనివాసరెడ్డికి, ప్రజా ప్రతినిధులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీని సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విషయమని అన్నారు. ఇది కచ్చితంగా ప్రజా ప్రభుత్వమని రైతు సాధించిన విజయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో హర్షత్ రేఖాల వ్యక్తం అవుతున్నాయని, రైతులు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన క్యాలెండర్ విడుదల వంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో నెరవేర్చబోతున్నట్లు స్పష్టం చేశారు. రైతు రుణమాఫీకి శ్రమించిన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్, జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మూడుముంతల గంగరాజు యాదవ్, తాళ్లూరి హనుమంతరావు, బెడద సత్యనారాయణ,Md Y పాషా, గజ్జి సూర్యనారాయణ, బాణాల లక్ష్మణ్,ప్రతిభారెడ్డి, జ్యోతి, భవాని, పర్వత శ్రీను, బీరెడ్డీ రమేష్, కిలారి అనిల్,ఏలూరి రవికుమార్, బోజెడ్ల సత్యనారయణ, ముజాహిద్దిన్, వాసీమ్, అశ్వంత్, మునగాల కాంతారావు,భూక్యా సురేష్ నాయక్, బడేమియ, అమరనేని బాబురావు, తదితర నాయకులు పాల్గొన్నారు