అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం

 

▪️ పండ్ల షాపులు పూర్తిగా దగ్ధం.
▪️ సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం..

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూలై 16

హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గల పండ్ల షాపులలో నిన్న రాత్రి సుమారు 11 గంటలకు ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఒకసారి మంటలు చెలరేగడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వ్యాపారులందరూ సుమారు రెండు నుంచి మూడు లక్షల సరుకు తెచ్చి నిలువ ఉంచుకున్నారు. దురదృష్టవశాత్తు షాపులు కాలిపోవడంతో వ్యాపారులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking