రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 16 జులై 2024:
బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏర్పుల శ్రీకాంత్, యువ నాయకులు తిరుపతి, అరుణ్ ల పుట్టిన రోజు వేడుకలను మణికొండ మునిసిపాలిటీ స్థానిక బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ల ధనరాజ్ ఆద్వర్యంలో ఘనంగా జరుపు కోవడం జరిగినదని ఈ సందర్భముగా కౌన్సిలర్ లు వసంత్ రావ్ చౌహాన్, ఆలస్యం నవీన్ కుమార్ లు మరియు విచ్చేసిన అతిథులందరూ కలసి ముగ్గురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి అతిథి సత్కారములుగా సహపంక్తి భోజనాలు జరిపిన పిదప అందరూ ఏకాబిప్రాయంతో రాబోయే 20 వ తేది శనివారం రోజున మణికొండ లోని పార్టీ నాయకులతో విస్తృత కార్యకర్తల సమావేశం జరుపడానికి నిర్ణయించామని, అందుకు ముఖ్య అతిదులుగా భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, యువ నాయకుడు కార్తీక్ రెడ్డి ఆదిగా విచ్చేసి కార్యకర్తల నుద్దేశించి మార్గదర్శనం చేస్తారని తెలిపినారు, ఈ సందర్భముగా పార్టీ సీనియర్ నాయకులు ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, సంఘం శ్రీకాంత్, సయ్యద్ రఫీక్, లతా గౌడ్, సురేఖ, దిలీప్, భానుచందర్, ఎం.శ్రీనివాస్, హుస్సేన్, మహేష్ యాదవ్, శివ ముదిరాజ్, గట్టు చంద్రశేఖర్ గౌడ్, సంఘం ప్రశాంత్, నితీష్, సంతోష్, శ్రీకర్, ఆదర్శ్, మనోజ్, అనిల్, రేవంత్, గణేష్ తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు.
Prev Post
Next Post