చిరు వ్యాపారస్తులకు ప్రణవ్ భరోసా

 

– కాలిపోయిన దుకాణాలను పరిశీలించిన ప్రణవ్
– భాదితులతో మాట్లాడి ధైర్యం చెప్పి,న్యాయం చేస్తానని హామీ.
– విషయం తెలియగానే సహయ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కార్యకర్తలకు,నాయకులకు అదేశం.
– భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి.

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూలై 16

సోమవారం అర్ధరాత్రి హుజురాబాద్ పట్టణంలో జరిగినటువంటి అగ్నిప్రమాదం చాలా బాధాకరమని నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం అగ్నిప్రమాదం జరిగిన చోటును ప్రణవ్ పరిశీలించారు.ఈ సందర్బంగా తమ జీవనాధారమైన షాపులను కోల్పోవడం జరిగిందని ప్రణవ్ ముందు ఆవేదన చెందగా వారికి నేనున్నా అని ధైర్యం చెప్పి ఓదార్చారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలను చిరు వ్యాపారస్తులతో, అధికారులతో మాట్లాడి,బాధితులకు న్యాయం జరిగేలా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సుమారు 35 దుకాణాలకు సంభందించి షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయని, స్థానిక అధికారులకు నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని నివేదిక వచ్చిన తర్వాత నష్ట పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారస్తులు ఎవరు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం వారిని అదుకుంటుందని భరోసా కలిగించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking