నేను గౌలిగూడ లోని మా వదిన అనారోగ్యాంగా ఉంటె పరామర్శిద్దామని వెళ్లను . కార్ ఎక్కడానికి ముందు ఒక వ్యక్తి స్కూటర్ పై అటుగా వస్తూ నన్ను చూసి ఆగి నా వద్దకు వచ్చి నమస్కరించాడు. చూడగా అతను ఓంకార్ అని జనసంఫ్‌ు నాటి కార్యకర్త.
నేను అతన్ని అడిగాను ఇంత ఎండలో ఎటువెళ్తున్నావ్ అని దానికి అతడు పోలింగ్ రోజు కధా సర్ డివిజన్ లోని అందరి ఇంటికి వెళ్తూ జనాలకి ఓటువెయ్యాల్సిందిగా కోరుతున్న అని చెప్పాడు.
నాకు చాలా సంతోషం వేసింది. ఓంకార్ గారి వయసు 82 సం’’ పైమాటే కానీ ఆ వయసులోనూ అతడు ఎవరినుండి ఏమీ ఆశించకుండా పార్టీనుండి పదవుల ఆశించకుండా సమాజం పట్ల నిబద్ధతతో తపనతో దాదాపు 60 ఏండ్లుగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ ఓంకార్ గారు. ఇలాంటివారినీ సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అతను ఎంతటి దీనావస్థలో ఉన్నా చలించకుండా వయసు మీద పడుతున్న బెదరకుండా అందరూ ఓటు వెయ్యాలనే గొప్ప సంకల్పంతో పనిచేస్తుండడం చూస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. ఇలాంటి వారినుండి నేటి యువతరం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది
శ్రీ ఓంకార్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటున్నాను
82 సంవత్సరాల వయసు ఉన్న జనసంఫ్‌ు నాటి కార్యకర్త ఓంకార్ .60 ఏండ్లుగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఓంకార్ ని బండారు దత్తాత్రేయ గుర్తించడం హైదరాబాద్ బీజేపీ కార్యకర్తలు గర్వించదగ్గ విషయం కానీ పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తెలంగాణా రాష్ట్ర బీజేపీ పార్టీ ఇలాంటి సీనీయర్ నాయకులకు కేంద్ర ప్రభుత్వానికి నామీనేట్ పదవుల కోసం సిఫారస్ చేయకపోవడం నామీనేట్ పదవులు నికారసైన జనసంఫ్‌ు నుండి బీజేపీ వరకు పని చేసిన ఓంకార్ డాక్టర్ సురేందర్ ,సద్గునానంద్, మొదలగు వారికి కేంద్ర ప్రభుత్వంలో నామీనేట్ పదవులు లభించకపోవడం బాధకరమైన విషయం.