ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 14:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా.టి.రఘునాథస్వామి,
కీసర డివిజన్ ఉప జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా.ఎన్.నారాయణరావుతో పాటు ప్రోగ్రాం అధికారి (మాతృ-శిశువు) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పల్‌లోని వైద్యాధికారిణి డాక్టర్ సౌందర్య లత, శ్రీనివాస్, గర్భనిర్ధారణ ప్రక్రియలకు సంబంధించిన సూచనలను పేర్కొనకపోవడం,అందుబాటులో లేకపోవడం మరియు సరిగ్గా నింపని ఫారం-ఎఫ్‌లు, స్కాన్ చేస్తున్న వైద్యులు సంతకం చేయని నివేదికలు, తప్పనిసరి రిజిస్టర్‌లను నిర్వహించకపోవడం మరియు ఆన్‌లైన్‌లో సమర్పించకపోవడం ఎంట్రీలు, మరియు ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్, 1994 కింద నిబంధనలు మరియు సెక్షన్ల ప్రకారం, ఉప్పల్లో ఉన్న గురు కృపా కాంప్లెక్స్‌లోని
M/s వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ మరియు
M/s శోబసాయి డయాగ్నోస్టిక్స్ యొక్క అల్ట్రాసౌండ్ మెషీన్‌లను సీజ్ చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గర్భనిర్దార్దిత స్కాన్లు సరిఅయిన దస్తావేజులు లేనిచో ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్, 1994 క్రింద కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా.టి.రఘునాథస్వామి,