జనరల్ అబ్జర్వర్
డాక్టర్ ప్రియాంక శుక్లా, జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 14:
07- మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి సోమవారం జరిగిన పోలింగ్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం ) యంత్రాలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా హోలీ మేరీ కాలేజీ, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు మల్కాజిగిరి నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్
డాక్టర్ ప్రియాంక శుక్లా, జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్,అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి,వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్ ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేసి భద్రపరచడం జరిగిందని జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్ అన్నారు.
మంగళవారం హోలీ మేరీ కాలేజీ,సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో ఈవిఎమ్ లను భద్రపరచడం జరిగింది.స్ట్రాంగ్ రూమ్ లకు సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది 24 గంటలు నిరంతర పర్యవేక్షణ వుంటుందని అన్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ లోని మేడ్చల్ ,మల్కాజిగిరి,ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల లకు సంబంధించిన ఈవిఎమ్ లను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ వి యం యంత్రాలను హోలీ మేరీ కళాశాల లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగిందని,అలాగే ఎల్ బి నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబందించిన ఈవి యం లు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్ కు సంబందించిన ఈవియంలు వెస్లీ కళాశాల లో భద్రపరచడం జరిగిందని, స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేసి మూడు అంచల పటిష్ట భద్రత ను ఏర్పాటు చేయడం జరిగిందని పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెగ్మెంట్ ల ఏ ఆర్ ఓ లు
ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.