ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 08 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని అంకతివాడకు చెందిన వేముల మహేష్ అనే 30 సంవత్సరముల వ్యక్తి కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది.మహేష్ మీసేవా ఉద్యోగి.తనకు భార్య రాధికతో వివాహం జరుగగా సంతానం లేకపోవడంతో ఇటీవలే చిన్న పాపను దత్తతకు తీసుకున్నారు.తల్లి తన పాప ఆరోగ్యం బాగలేక వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది.మహేష్ కూడా వారంకి ఒకసారి వెళ్లి పాపని భార్యని చూసి వస్తున్నాడు. ఈనెల 7వ తారీకున ఉదయం భార్యతో కాసేపు ఫోన్ మాట్లాడి ఉద్యోగ రీత్యా మీసేవకి వెళ్తున్న అని చెప్పి వెళ్ళాడు.సాయంత్రం వరకు ఫోన్ చేయలేదు ఇంటికి రాలేదని తెలిసింది.ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండటంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇండ్లలో వెతికిన, చుట్టుప్రక్కల వెతికిన ఆచూకీ దొరకకపోవడంతో ఆయన మేనమామ పోలీస్టేషన్లో పిర్యాదు చేసారు.తప్పిపోయిన వ్యక్తి 5.5 ఫీట్ల ఎత్తు ఉంటాడు. కళ్ళజోడు దరిస్తాడు.
గుండ లచయ్య(మిస్ అయిన వ్యక్తి మేనమామ) పిర్యాదు మేరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై. పి చంద్రకుమార్ సెల్ ఫోన్ నెంబర్ 8712656545 కు తెలుపారు.