రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 23 ఫిబ్రవరి 2024:
మణికొండ ప్రజలారా మా యందు ఎనలేని ప్రేమానురాగాలు అందిస్తున్న మీ అందరికీ హృదయ పూర్వక కతజ్ఞతాభి వందనాలు. నిన్నటి రోజున కౌన్సిల్లో మేము విశ్వాసం కొల్పోయామని చేస్తున్న ప్రచారంలో విశ్వసనీయత లేదని, మొదటి నుండి చైర్మన్ చేస్తున్న ఒంటెద్దు పోకడలకు నిరసనగా పార్టీలకు అతీతంగా 10 మంది కౌన్సిలర్లం ఏక లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో మాలో ఒకరు వెన్నుపోటు పొడువుగా, తటస్థముగా ఉన్న సోదరీమణి ఒకరు కలువడం, మెజార్టీ వైపు మొగ్గు చూపుతానని మొదటి నుండి చెబుతూ వచ్చిన వైస్ చైర్మన్ మాట మీద నిలబడడంతో మేమంతా నైతిక విజయం సాధించినామని గర్వంగా చెబుతూ ఇక ముందు కూడా ప్రజా సమస్యలపై ముక్త కంఠంతో ఛైర్మన్ ఒంటెద్దు పోకడలకు కళ్ళెం వేస్తూ ప్రజాసేవ కొనసాగిస్తు అందరి మన్ననలను పొందుతామని తెలియ పరుస్తున్నాము.
కౌన్సిల్ మొత్తంగా గల 20 మంది కౌన్సిలర్లకు గాను పెద్ద మనిషి మరియు కేవలం 7 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుండా గోవాలో తన అధుపాజ్ఞలలో కట్టడి చేసి, లోపయకరంగా ఉన్న మున్సిపల్ చట్టాల నిబంధనలకు అనుగుణంగా కేవలం అవిశ్వాస తీర్మానంకు కావలసిన కోరం లేకుండా చేసి అదే తమ 8 మంది విజయం సాధించినట్టు గొప్పలు చేప్పుకోవడంలోనే విషయ పరిజ్ఞానం తేలి పోయింది, అస్సలు చైర్మన్ పై ఎంత మంది కౌన్సిలర్లకు నమ్మకం ఉన్నదో ప్రజల ముందు తేట తెల్ల మైనదని, ఇదీ ఒకందుకు అసలైన పరాజయమని తెలినందువలన చైర్మన్ పదవికి అన్హరుడిగా మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నైతికంగా ఓటమిని అంగీకరించి భాధ్యత యుతంగా వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని మణికొండ పురపాలక సంఘం 7వ వార్డు కౌన్సిలర్ బిట్లు పద్మారావు సహచర మిత్ర బృందం డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.