– అందిన కాడికి దోచుకుంటున్న మాఫియా
– పట్టించుకోని అధికారులు
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి మార్చి 4
హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం కనగర్తి
గ్రామం లో గత నాలుగు సంవత్సరాలగా కంచం గోవర్ధన్ అనే వ్యక్తి తన జెసిబి తో కనగర్తి లోని పెద్ద చెరువు, పిన చెరువు, రాయికుంట,మాటుకుంట చెరువులలోని మొరం, మట్టిని విచ్చలావిడిగా ఇతర గ్రామాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నాడు. ఒక్కో ట్రాక్టరు మట్టిని అధిక ధరలకు అమ్ముకుంటూ గ్రామము లోని చెరువులను సర్వ నాశనం చేస్తున్నాడు.గతం లో ఇదే గోవర్దన్ పైన కేసు నమోదు కావడం జరిగింది.ఐనా కూడా ఏ మాత్రం భయం లేకుండ అధికారులకు లంచం ఎర చూపిస్తూ తన మట్టి మాఫియాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాడు. దీని వలన మత్య సంపద తగ్గడం తో పాటు చేపలు అనేక అనారోగ్యాల పాలు అవుతున్నాయి.అంతే కాకుండ చెరువులో జెసిబి తో లోతైన కందకాలు త్రవ్వడం వలన మూగ జీవాలు,మత్స్య కారులు,పశువుల కాపరులు ప్రమాదాలకు గురయ్యే ఆవకాశం ఉంది.ఇకనైనా ఈ మట్టి మాఫీయను అధికారులు అడ్డుకోక పోతే చెరువులు భావి తరాలకు అందకుండా పోయే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెల్లిన సంబంధిత అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని కరీంనగర్ జిల్లా ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేశం అన్నారు