మేడ్చల్ -మల్కాజిగిరి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
డా. సి. ఉమా గౌరి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 4:
పీసీపీఎండీటీ చట్టం అమలు పర్యవేక్షణలో భాగంగా వాయుపురి లోని ప్యూర్ ఆర్థో ఆసుపత్రి మరియు శ్రీ రక్షా ఆసుపత్రిని అందులోని స్కాన్ యంత్రాలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీ సందర్భంగా,
డా. ఉమా గౌరి నమోదిత ధృవపత్రాలు , ఫార్మ్ ఎఫ్ నమోదు (ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ సమర్పణలు) సహా పీసీపీఎండీటీ
చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ జరుగుతున్నదాని పరిశీలించారు.
అంతేకాకుండా, అవసరమైన రికార్డులు, ప్రదర్శనా పట్టికలు, అనుమతి పత్రాలు పరిశీలించడంతో పాటు, సంబంధిత రేడియాలజిస్టు సంతకంతో ఫార్మ్ ఎఫ్
ఉండేలా నిర్ధారించారు.
ఈ సందర్భంగా డా. ఉమా గౌరి పీసీపీఎండీటీ చట్టం ప్రకారం అన్ని అవసరమైన పత్రాలను కనీసం రెండు సంవత్సరాలు భద్రపరచడం తప్పనిసరి అని తెలిపారు.
గర్భనిర్ధారణ పద్ధతుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్ట నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.