ప్రజల సేఫ్టీ సెక్యూరిటీ చాలా ముఖ్యం,
పెండింగ్ కేసులపై నెల వారి సమీక్ష సమావేశం
శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యెస్.పి శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు జిల్లా సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా యెస్.పి శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు మాట్లాడుతు.. గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి ఏ ఏ అంశాలు కోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రతి అధికారికి పూర్తి స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చేదించాలి, కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. నాన్ బేయిలబుల్ వారెంట్ త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలి.
అలాగే సీసీ కెమెరాలు ఉంటే గ్రామానికి రక్ష ప్రజలకు రక్షణ సెక్యూరిటీగా 24X7 పనిచేస్తాయని జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు వివిధ కుల సంఘాల వారు ముందుకు రావాలని ప్రజలకు మెరుగైన సేవలు గురించి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత దగ్గరై సేవలు చేయడానికి సీసీ కెమెరాలు ఉపకరిస్తాయని అమాయకులను చట్టం నుండి రక్షించడానికి సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడతాయని సీసీ కెమెరాల పుటేజ్ వల్ల కోర్టులో నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని తెలిపినారు సున్నితమైన ప్రాంతాల్లో నిఘా సిసి కెమరాలు ఎంతో కీలక ప్రాత వహిస్తాయని, మరియు వ్యక్తుల కదలికలను పరిశీలించడానికి ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలను ఎంతోగానో పయోగపడతాయన్నారు.సీసీ కెమెరాలు 24 గంటలు 365 రోజులు నిర్విరామంగా నిరంతరాయంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని తెలిపినారు. కోర్ట్ విది నిర్వహణలో శిక్షలు పడే విదంగా కృషి చేసిన మెదక్ సెషన్స్ కోర్ట్ పిపి.ఎస్‌ఆర్.ఫజల్ హైమద్ గారిని, రామాయంపేట శ్రీ. చంద్రశేఖర్ గారిని, తూప్రాన్ సి.ఐ శ్రీ.శ్రీధర్ గారిని, నిజాంపేట ఎస్.ఐ శ్రీ.శ్రీనివాస్ రెడ్డి గారిని, కోర్ట్ లైజైనింగ్ ఆఫీసర్ ఎస్.ఐ శ్రీ.విట్టల్ గారిని,కానిస్టేబుల్ రవీందర్ గాని, నిజాంపేట కోర్ట్ కానిస్టేబుల్ సాయిబాబా గారిని, , అభినందించి శాలువా తో సత్కరించినారు. ఈ సమావేశంలో మెదక్ డి.ఎస్.పి శ్రీ.సైదులు గారు,తూప్రాన్ డి.ఎస్.పి శ్రీ.యాదగిరి రెడ్డి గారు, ఆర్.ఐ.శ్రీ.నాగేశ్వర్ రావ్ గారు,ఎస్.బి.సి.ఐ.శ్రీ.నవీన్ బాబు గారు, డి.సి.ఆర్.బి. సి.ఐ.శ్రీ.దిలీప్ గారు, జిల్లా సి.ఐ.లు, ఎస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.