ప్రధానమంత్రి మోడి పర్యటన సందర్భంగా బీసీ బిల్లుపై విధాన ప్రకటన చేయాలి

 

బీసీ ముఖ్య నాయకుల కోర్ కమిటీ సమావేశం డిమాండ్

హైదరాబాద్ ఏప్రిల్ 7 : ప్రధానమంత్రి మోడి పర్యటన సందర్భంగా బీసీ బిల్లుపై విధాన ప్రకటన చేయాలని బీసీ ముఖ్య నాయకుల కోర్ కమిటీ సమావేశం డిమాండ్ చేసింది.శుక్రవారం కాచి గుడలోని అభినందన్ హోటల్ లో గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, లాల్ కృష్ణ అధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా రాజ్యసభ సభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు  ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా బిసిల డిమాండ్లపై ప్రధానమంత్రి విధాన ప్రకటన చేయాలని కోరారు. ముఖ్యంగా  కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, చట్ట సభలలో 50 శాతం రిజర్వేషనుపై విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు. దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టడానికి పార్లమెంటు లో బీసీ బిల్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు గత పది రోజులుగా వేలాది మందితో ఢిల్లీలో పార్లమెంట్ వద్ద ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, పార్లమెంటు ముట్టడి లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , ఒరిస్సా కు చెందిన వేలాదిమంది నాయకులూ, కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో బీసీ సంఘం నాయకులు కేంద్రమంత్రులను, పార్లమెంట్ సభ్యులను, ప్రతి పక్ష పార్టీ నేతలను కలిసి బీసీలకు రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన వాటాను  ఇవ్వవలసిన ఆవశ్యకతను చెప్పడం జరిగింది. స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమలు జరిగిన నాటి నుంచే బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో బీసీలకు అన్యాయం చేశారు. కనీసం ఇప్పుడైనా జనాభా ప్రకారం సమాన వాటా ఇవ్వాలి కానీ 75 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఏ రంగంలో బీసీలకు వాటా లభించలేదు.  రాజకీయరంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 16 శాతం, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో ఒక శాతం, ఉన్నత న్యాయస్థానాల్లో 2 శాతం, ప్రైవేటు రంగ ఉద్యోగాలలో 5 శాతం ప్రాతినిధ్యం బీసి లకు లభించలేదు. దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలకు 75 సంవత్సరాలు స్వాతంత్ర  భారతదేశంలో ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ఇదెట్ల  ప్రజాస్వామ్యం అవుతుందని ప్రశ్నించారు. రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయం ఇంతవరకు లభించలేదన్నారు.  ఈ క్రింది డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది. పంచాయతీరాజ్ సంస్థ బి.సి. రిజర్వేషన్లను 34 శాతం నుండి 56 శాతం కు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. త్వరలో జరిగే జనగణనలో “కుల గణన చేపట్టాలని,బి.సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమీ లేయర్ ను తొలగించాలని,కేంద్రంలో బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బి.సి ల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని,ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బి.సి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి “బి.సి. యాక్టు”ను తీసుకరావాలని,రాష్ట్రంలో కేంద్రంలో విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలని,ప్రెవేట్ రంగ పరిశ్రమలలో, కంపెనీలలో తదితర ప్రెవేట్ రంగాలలో  ఎస్సీ/ఎస్టీ/బి.సి లకు జనాభా ప్రకారం  ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోర్ కమిటి సమావేశం డిమాండ్ చేసింది.  ఈసమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, లాల్ కృష్ణ, నీల వెంకటేష్, సుధాకర్ ముదిరాజ్, భూపేష్ సాగర్, , అనంతయ్య, కె. రాము, నందగోపాల్, వెంకట్ యాదవ్ శ్రీదేవి, దీపికా, మంజులా, పండరి నాద్,  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking