ఖమ్మం ప్రతినిధి జూన్ 15 (ప్రజాబలం) ఖమ్మం విద్యార్థులకు వివిధ రంగాలలో స్కిల్ డెవలప్మెంట్ పై ప్రోగ్రాం లు నిర్వహించే ఇంపాక్ట్ పౌండేషన్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన, భవిష్యత్తు కార్యచరణ శిక్షణ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా బొనకల్ మండలం రామాపురం గ్రామానికి షేక్ జానీమియా(నేరడ) కి ప్రధమ స్థానం దక్కింది ఈ కార్యక్రమం గత 35 రోజుల పాటు నిర్వహించినట్టు ఆయన తెలిపారు ఈ శిక్షణా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభించిందని డాక్టర్. ఆదినారాయణ రెడ్డి తెలిపారు.షేక్ జానీమియా మాట్లాడుతూ తాను ఈ శిక్షణ లో ఎన్నో విషయాలు తెలుసు కోవటం, నేర్చుకోవటం జరిగిందిన్నారు. తాను తెలుసుకున్న విషయాలు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అవగాహనా సదస్సు లు నిర్వహిస్తానని. వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారి భవిష్యత్తు లో ఏమి సాధించాలి అని అనుకుంటున్నారో దాని పై అవగాహనా మెలుకువలు తెలుపుతానని షేక్ జానీమియా అన్నారు . అనంతరం డాక్టర్ ఆదినారాయణ రెడ్డి, రాములు, రాజేశ్వరి, భాస్కర్ రావు, కిషోర్ రెడ్డి. ఆధ్వర్యంలో ప్రశాంస పత్రాన్ని జానీమియా కి అందజేశారు.