బిజెపి అర్బన్ మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి గా శేఖర్

 

జగిత్యాల ప్రతినిధి, జూన్ 15(ప్రజా బలం) భారతీయ జనతాపార్టీ జగిత్యాల అర్బన్ మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా బాపురపు శేఖర్ నియమితులయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి జగిత్యాల అర్బన్ మండల యువ మోర్చ ప్రధాన కార్యదర్శి గా బాపురపు శేఖర్, ఉపాధ్యక్షులు రాగుల విజయ్ చందర్, ఈడుదుల గంగ రాజం లను నియమిస్తు నియామక పత్రాన్ని జగిత్యాల బిజెపి యువ మోర్చ అధ్యక్షులు బొల్లం అజయ్ కుమార్, అందజేశారు. ఈ సందర్భంగా బాపురపు శేఖర్ మాట్లాడుతూ
నాపై నమ్మకంతో నా నియామకానికి సహకరించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షులు పైడిపెల్లి సత్యనారాయణ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు గడ్డం రాంరెడ్డి, యువ మోర్చ అధ్యక్షులు బొల్లం అజయ్ కుమార్, మండల ఇంచార్జీ జున్ను రాజేందర్, కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, యువ మోర్చ అధికార ప్రతినిధి కుర్మా రమేష్, కాయితి శంకర్, అర్బన్ దళిత మోర్చా అధ్యక్షులు బాపురపు గంగన్న తదితరులు పాల్గొన్నారు
బాపురపు శేఖర్ నియాకంపట్ల పలువురు బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking