టీటీడిపి ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్ జూన్ 15 (); మార్కెట్ యార్డులలో రైతులు తరలించిన పంటలను రక్షించలేని పరిస్థితి నేకొన్నదని.. దశాబ్ది ఉత్సవాలు అంటూ రైతులకు బేడీలు వేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు.. గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ట్లాడుతూ..దశాబ్ది ఉత్సవాల కోసం చేస్తున్న ఖర్చుతో రైతులు పండించిన పంటలను కాపాడడానికి టార్పాలిన్ల పై ఖర్చు చేసి ఉండినట్లయితే రైతులు పంటలను నష్టపోయి ఉండేవారు కాదు. దుబారా ఖర్చు రాష్ట్రానికి అవసరమా? మిగులు రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా తయారు చేశారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చినందు వల్ల రైతులు ధర్నాలు చేస్తే వారికి బేడీలు వేసి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మూడు సందర్భాల లో రైతులను అరెస్టు చేసి ఈ ప్రభుత్వంబేడీలను వేసింది. ఇది పురోగతా..?అని ప్రశ్నించారు.