రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 సెప్టెంబర్ 2023: రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయ సమావేశ మందిరంలో రాజేంద్ర నగర్ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో గణేష్ ఉత్సవాల నిర్వహణపై డీ.సీ.పీ జగదీశ్వర్ రెడ్డి, డీ.సీ రవి కిరణలతో కలసి స్థానిక శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్ సమావేశం జరుపడం మరియూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలను చేపట్టాలన్నారు. గణేష్ మండపాల వద్ద భక్తులకు ఇబ్బదులు లేకుండా చూడాలని సూచిస్తు లైటింగ్, మంచి నీరు, విద్యుత్, పారిశుధ్యం, మెడికల్ సౌకర్యాలు ఉండేలా చూడాలని, వినాయక నిమజ్జనం కొరకై వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుంతలు లేకుండా మరమత్తులు చేపట్టాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్
ఈ.ఈ. కి తెలిపారు. బారికేడ్లను ఏర్పాటు చేయాలని, విధ్యుత్తు తీగల సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. నిమజ్జన ప్రాంతాలలో అన్నివసతులతో, సిబ్బందితో, యంత్రాగం, ఉత్సవ కమిటీ, అధికారులు సమన్వయంతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా పని చేయాలని ప్రకాష్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, సంగీత, కమిటీ సబ్యులు తది తరులు పాల్గొన్నారు.