గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

 

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం

పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 08 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 1 టౌన్ లో కానిస్టేబుల్  గా విధులు నిర్వహిస్తూ పి. ప్రవీణ్ పీసీ .3386 గుండెపోటుతో మరణించగా ఆయన భార్య అనూషకి  భద్రత ఎక్స్గ్రేషియా5,49,000 (ఐదు లక్షల నలబై తొమ్మిది వేల రూపాయల ) చెక్ ను ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ తన కార్యాలయం లో వారికి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని సీపీ అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ అశోక్ కుమార్,సూపరిండెంట్  సంధ్య,రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking