భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి
రాష్ట్ర, జిల్లా ప్రజలు పాడిపంటలు, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలి
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి
–జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి :-
శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతిష్టాత్మక మహిమాన్విత ఏడుపాయల దుర్గ భవాని మాతను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబం సమేతంగా పట్టు వస్త్రాల సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
ఇంతకుముందు జిల్లా కలెక్టర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజలు అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలన్నారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి లో ఉన్న ప్రతిష్టాత్మక మహిమాన్విత ఏడుపాయల జాతర శివరాత్రి మొదలుకొని మూడు రోజులు జరుగుతుందని ఈ జాతరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్, త్రాగునీరు, విద్యుత్, పరిశుభ్రత కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలన్నారు. భక్తులందరూ మూడు రోజులు పాటు జరిగే జాతరలో ప్రశాంతంగా దర్శనాలు , ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు.
రాష్ట్ర, జిల్లా ప్రజలు పాడిపంటలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.