👉పది సంవత్సరాలుగా దిగ్విజంగా కొనసాగుతున్న ఉచిత పండ్ల పంపిణీ.
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సదాశివపేట/మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని స్థానిక ఈశ్వర మార్కండేయ మందిరంలో సదాశివపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పిల్లోడి జయమ్మ, మాజీ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలో ఉన్న భక్తులకు పలహారా పంపిణీ చేశారు,గత 10 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఉచిత పండ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ సందర్బంగా మాజీ చైర్మన్ మరియు మాజీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని దేవదేవుడైన ఆ పరమశివుని వేడుకున్నాము అని అన్నారు,ఈ కార్యక్రమంలో రాణా ప్రతాప్ యూత్ సభ్యులు, మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.