సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

 

సమస్యలు ప్రస్థావించని ప్రజాప్రతి నిధులు

తూ తూ మంత్రంగా ముగింపు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 03 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదా సీదాగ జరిగింది. ప్రజాప్రతినిధులకు చివరి సమావేశం అయినందున ఎలాంటి చర్చలు జరగలేదు. తూ తూ మంత్రంగా సమావేశం నిర్వహించారు. దళిత బంధుపై ఎంపీటీసీ ముత్తె సత్తన్న ప్రశ్నించారు. కనీసం వర్షాకాలం సీజన్ ప్రారంభమైన వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన అంశాలపై చర్చ అసలే జరగలేదు.అనంతరం ఎంపీపీతో పాటు ప్రజాప్రతినిధులందరిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ఎంపీపీ అన్నం మంగ ప్రారంభించారు.ఈ సమావేశంలో ఎంపీపీ అన్నం మంగ,ఎంపీటీసీ ముత్తె సత్తన్న,ఎంపీడీవో సరోజ, డీసీఎంఎస్ చైర్మన్ లింగన్న, తహసీల్దార్ రాఘవేంద్ర రావు,అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రభాకర్ రావు,ఎంపీవో అజ్మాత్ ఆలీ,అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking