ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 3

జమ్మికుంట మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశ మందిరంలో మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మాన మహోత్సవం బుధవారం నిర్వహించారు. ఎంపీపీ దొడ్డే మమత ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ ఎంపీపీ తిరుపతిరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల కాలంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించినట్టు పేర్కొన్నారు.

అందరికీ ధన్యవాదాలు:

జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ప్రసాద్


సమావేశంలో ఎంపీపీ దొడ్డే మమత మాట్లాడుతూ ఈ ఐదేండ్ల కాలంలో సభ్యుల సహకారంతో సేవలు అందించినట్టు పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. 100 కోట్ల రూర్బన్ నిధులతో మండల పరిధిలో అభివృద్ధి పనులు చేసినట్టు వివరించారు. ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ‘దళిత బంధు’ నిధులను లబ్ధిదారులకు అందేలా పనిచేసినట్టు స్పష్టం చేశారు. తనను చిన్న వయసులోనే ఎంపీపీ చేసిన మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, మండల పరిధిలోని ఎంపీటీసీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు రాజకీయం అంటే ఏంటో తెలియనప్పటికీ అందరి సహకారంతో ఐదేళ్లపాటు ఎంపీపీగా సేవలందించినట్టు వెల్లడించారు. పాత్రికేయులు ప్రజా ప్రతినిధులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు అందరినీ శాలువాలతో ఘనంగా సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking