పి శశికళ గౌరవ అధ్యక్షులు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక హైదరాబాద్ సౌత్ కమిటీ
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామపంచాయతీ,మున్సిపాలిటీ,మండల పరిషత్, జిల్లా పరిషత్లలో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి వీలుగా ప్రత్యేక చట్టం చేయాలని హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నేడు జియాగూడలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
రాష్ట్రంలో 2024 డిసెంబర్ నాటికి 12769 గ్రామ పంచాయతీలు, 130 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్స్, 540 మండల పరిషత్లు, 32 జిల్లా పరిషత్లు ఉన్నవి. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి ప్రత్యేక చట్టాలు చేసి అమలు చేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పంచాయతీ రాజ్ చట్టానికి మరియు మున్సిపల్ చట్టానికి సవరణలు చేసి, ఇద్దరు వికలాంగులను నామినేట్ చేసేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018,తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లలో సవరణలు చేసి, ప్రత్యేక చట్టం చేసి వికలాంగులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము. స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేస్తే గ్రామ పంచాయతీలలో 25,538 మందికి, మున్సిపాలిటీలలో 260 మందికి, మున్సిపల్ కార్పొరేషన్లలో 26 మందికి, మండల ప్రజా పరిషత్ లలో 1080మందికి, జిల్లా పరిషత్లలో 64 మందికి రాజకీయ అవకాశాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 26,968 మందిని నామినేటెడ్ చేయడానికి అవకాశం ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల్లో వికలాంగులకు(నామినేట్ ) ప్రతినిత్యం కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
సంతకాల సేకరణ కార్యక్రమంలో హైదరాబాద్ నగర ఉపాధ్యక్షులు ఎస్ రాజు, సహాయ కార్యదర్శి నర్సింగ్, నాయకులు లావణ్య తదితరులు పాల్గొన్నారు.