(ప్రజాబలం జగిత్యాల జిల్లా: ప్రతినిధి మార్చి 1) జగిత్యాల జిల్లా వాణి నగర్ లోని నలంద హై స్కూల్లో శనివారంనాడు ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్ని జంతు శాస్త్రం మరియు వృక్షశాస్త్రం విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు సైన్సు గురించిఆలవాట్లు మరియు విజ్ఞానాన్ని ప్రేరేపించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ వేడుకలు చేపట్టబడ్డాయి.
ఈ కార్యక్రమంలో నాన్-సైన్స్ విభాగం విద్యార్థులకు ల్యాబ్‌లలోని స్పెసిమెన్‌లు, వివిధ మోడల్స్, ల్యాబ్ ఆపరేటర్లు ప్రదర్శించి, సైన్స్ సూత్రాలను అర్థం చేసుకోవడానికి సహాయపడిరది. అలాగే, కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో క్విజ్ పోటీ కూడా నిర్వహించి, విజేతలను అభినందించారు.తదుపరి సమావేశంలో, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సిని పాల్ వావోలిల్ మరియు తామస్ గారు రామన్ ఎఫెక్ట్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. వారు సైంటిఫిక్ టెంపర్‌ను పెంపొందించుకోవాలని, అలాగే ప్రస్తుతకాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సైన్సు విషయాలను అర్థం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.