శ్రీ వైష్ణవి ఒలింపియాడ్‌ స్కూల్‌ లో ఘనంగా ఆర్ట్‌ మరియు సైన్స్‌ ఎక్షిబిషన్‌

సంగారెడ్డి ప్రజాబలం ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం బీరంగూడలోని శ్రీ వైష్ణవి ఒలింపియాడ్‌ స్కూల్‌ లొ జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారము ఆర్ట్‌ మరియు సైన్స్‌ ఎక్షిబిషన్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శ్రీ వైష్ణవి ఒలింపియాడ్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ చైర్మన్‌ సుశీల్‌ వర్మ విచ్చేసి ఆర్ట్‌ %డ% సైన్స్‌ ఎక్షిబిషన్‌ ను ప్రారంబించారు. విధ్యార్ధులు రూపొందించిన పలు ఆవిష్కరణలను ను వీక్షింవి అభినందించారు. విద్యార్థులు తమలో ఉన్న ప్రథిభను వెలికి తీసి అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారని అన్నారు. ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి పెంపొందించడం కోసం పాఠశాలలో సైన్స్‌ ఫేర్‌ నిర్వహించడం జరిగిందని విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్‌ ఫేర్‌లు ఎంతో దోహదపడతాయని ప్రిన్సిపాల్‌ సోనుకుమార్‌ యాదవ్‌ తెలిపారు. విద్యార్థులు రూపొందించిన దాదాపు 170 కి పైగా వర్కింగ్‌ మోడల్స్‌ చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ సుశీల్‌ వర్మ , ప్రిన్సిపాల్‌ సోను కుమార్‌ యాదవ్‌ , ఇంచార్జ్‌ మేగన ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking