రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 03 మే 2024:
బీ.ఆర్.ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపును సునాయాసంగా దశ దిశ మలుపు త్రిప్పి మణికొండ లోనీ కార్యకర్తలు ఐక్య మత్యంతో కార్ గేర్ మార్చి ముందుకు దూసుకు పోతున్న స్పీడ్ ను తట్టుకోలేక అయోమయ పరిస్థితిలో పడ్డ మాజీ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం మణికొండలోనీ ఓటర్ మహాశయులను ప్రత్యక్షముగా కలసి వారి యొక్క అమూల్యమైన ఓటును బ్యాల్లెట్లో 1వ నంబర్ కార్ గుర్తు బటన్ పై నొక్కి అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే సబ్బండ వర్గాల పక్షపాతి కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటు వేసి ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపాలని మణికొండ మున్సిపాలిటీ గులాబీ పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, మాజీ ఎం.పీ.పీ తలారి మల్లేశ్, పార్టీ అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత్ రావు చౌహన్, ఆలస్యం నవీన్ కుమార్, బుద్దోల్ కావ్య శ్రీరాములు, శైలజా వినోద్, మైనారిటీ నాయకుడు బషీర్, స్థానిక సీనియర్ నాయకులు బుద్దోల్ బాబు, మల్లేశ్ లతో పాటు అందె లక్ష్మణ్ రావు, విఠల్మ మహిళా నాయకురాల్లు, యువనాయకులు తదితర కార్యకర్తలందరు మంగళవారం 03 మే ఉదయం పూట పాల్గొని ప్రచారాన్ని బస్తి భాటగా నిర్వహించి కార్యక్రమాన్ని ఉత్సాహ పరచినారు.