హైదరాబాద్ ఏప్రిల్ 6 ;సమాచార పౌర సంబంధాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో మహిళా జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరంలో ఇప్పటివరకు 267 మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళా జర్నలిస్టుల కు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా జర్నిలిస్టులకు మాస్టర్ హెల్త్ చెక్అప్ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసింది.
ప్రతి రోజు ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే మాస్టర్ హెల్త్ చెకప్ లో రక్త పరీక్ష (C.B.P), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు చేస్తున్నారు. అదేరోజు పరీక్షల నివేదికలను అందచేస్తున్నారు. ఏప్రిల్ 9 వ తేదీ వరకు ఈ ఆరోగ్య శిబిరం పనిచేయనున్నది. మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. వైద్య అధికారులు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఈ విధానం పట్ల పరీక్షలు చేయించుకున్న మహిళా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.