ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగ అవాకాశాలు: జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎం కిషన్

 

మేడ్చల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 6: ఎచ్.సి.ల్ టెక్నాలజీస్ కంపెని వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు హైటెక్ సిటీ ఎచ్.సి.ల్ ఆఫీస్ నందు ఈ నెల 8 న జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీని కోసం 2022 & 23 ఎమ్.పి.సి, ఎమ్.ఇ.సి తో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు 60% ఓవరాల్ గాను, 60% మార్కులు మ్యాతమాటిక్స్ లో పొందిన అర్హులైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ లో పాల్గొనాలి అని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్,తెలిపారు.
► హెచ్సీఎల్ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సును 2022 & 2023లో పూర్తిచేసి ఉండాలి.
► ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ (MPC/MEC) ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మ్యాథమెటిక్స్/బిజినెస్ మ్యాథమెటిక్స్లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
► శిక్షణ పూర్తి చేసుకున్నవారికి హెచ్సీఎల్ టెక్నాలజీస్లో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారని తెలిపారు
► కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు రూ.10 వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే.. ప్రారంభ వార్షిక వేతనం 1.70 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు చెల్లిస్తారు.
► హెచ్సీఎల్లో పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూనే.. BITS Pilani, SASRA, Amity, KL, IIM Nagpur యూనివర్సిటీలలో ఉన్నత విద్య కోర్సులో చేరే అవకాశం కూడా ఉంది.
► పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కు:https://bit.ly/HCLTB-Telangana
పూర్తి వివరాలకు ఈ క్రింది నంబరుకు సంప్రదించాలని తెలిపారు.
జి సాయి రాఘవేంద్ర
హెచ్.సి.ఎల్ ఎరియా ప్రతినిధి
9063564875/
7674007616 / 9014600354.

Leave A Reply

Your email address will not be published.

Breaking