బడుగుల అభివృద్ధికి బాటలువేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్‌ రామ్

హైదరాబాద్ ఏప్రిల్ 5 ():నిమ్నవర్గాలు, బలహీనవర్గాలు, అల్పసంఖ్యాకవర్గాలు అన్ని రంగాలలో ఆధునిక అభివృద్ధిని అందుకున్నప్పుడే దేశం ప్రగతిని సాధిస్తున్నదని భావించి నిరంతరం కృషీవలుడుగా పరిశ్రమించిన మహనీయుడు స్వర్గీయ ఉపప్రధాని డా॥ జగ్జీవన్‌రామ్‌ అని ఐపిసి జాతెయ అద్యక్షులు శ్రీధర్ అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ పయనంలో జీవితాంతం పేదల సమున్నతికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేయించిన సామాజిక పరివర్తకుడు బాబు జగ్జీవన్‌రామ్‌ అని శ్రీదర్ పేర్కొన్నారు. స్వర్గీయ ‘‘జగ్జీవన్‌రామ్‌ 116వ జయంతి’’ సందర్భంగా అబ్దిస్ లోని సూర్య లోక్ కాంప్లెక్స్ లో ని పార్టీ కార్యాలయం లో జగజీవన్ రాం చిత్రపర్తానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో ఐపిసి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking