నిర్మల్ జిల్లా కేంద్రం మంచిర్యాల చౌరస్తా లో బండి సంజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రజా బలము ప్రతినిధి నిర్మల్ జిల్లా.. అంతకుముందు టెన్త్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పేపర్స్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడింది.
పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా బీజేపీ నేతలతో ప్రత్యక్ష సంబంధాలు.
కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో ఇదంతా జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
తెలంగాణపై కేంద్రం కక్ష్య గట్టింది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తోంది.
పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు.
దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టం.
తెలంగాణ రాష్ట్రంపై కక్ష్య గట్టిన కేంద్రం ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వన్ని బదనాం చేయాలని చూస్తోంది.
గతంలో ఎన్నడూ కూడా తెలంగాణలో ఈ విధంగా పేపర్ లీకేజీలు ఘటనలు జరగలేదు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో తెలంగాణలో ఏదో ఒక అలజడి సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి చూస్తుంది బిజెపి చూస్తుంది.కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర బీజేపీ నేతలు తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
మొన్న టీఎస్పీఎస్సీ పేపర్,నిన్న పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణంపై నిష్పక్షపాత దర్యాఫ్తు కొనసాగుతోంది. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు.